రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త

ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికుల్లో సంతోషం నింపుతున్న టీఎస్ ఆర్టీసీ..తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు శుభవార్త తెలిపింది. రాఖీ పౌర్ణమి రోజున మహిళలు వారి సోదరులకి స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని పరిస్థితులు ఉంటే.. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్‌ సర్వీసుల ద్వారా.. అతి తక్కువ ధరలకే రాఖీలను పంపించుకోవచ్చని ప్రకటించింది. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్‌ సర్వీసుల ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది.

దీని గురించి పూర్తి సమాచారం కోసం 9154298858, 9154298829 నంబర్లలో సంప్రదించాలని టీఎస్‌ ఆర్టీసీ సూచించింది. ఊర్ల నుంచి హైదరాబాద్ రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చింది. టీఎస్ ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి సజ్జనార్‌ సరికొత్త ఆలోచనలతో ఆర్టీసీకి రాబడి పెంచేందుకు కృషి చేస్తున్నారు. ప్రవైట్ ట్రావెల్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులకు ఊరట కల్పిస్తూ వస్తున్నారు. అలాగే సోషల్ మీడియా లోను టీఎస్ ఆర్టీసీ గురించి ప్రకటనలు , పిక్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటూ వస్తున్నారు.