భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ..?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అక్కడి రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు..? విజయం సాధించినా..? ఎంత మెజార్టీ వస్తుంది..? ఇలా ఎవరికీ వారు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడి నుండి పోటీ చేస్తారనేదానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో సింగిల్ గా బరిలోకి దిగి కేవలం సింగిల్ స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకున్నది జనసేన. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గాజువాక , భీమవరం స్థానాల నుండి పోటీ చేసి..రెండు చోట్ల ఓటమి చెందారు. దీంతో ఈసారి ఏ స్థానం నుండి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది.

గత కొద్దీ రోజులుగా గాజువాక , తిరుపతి , భీమవరం తదితర స్థానాల పేర్లు ప్రచారం జరిగినప్పటికీ.. భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఎక్కువగా వినిపిస్తుంది. పవన్ కోసం జనసైనికులు స్థానికంగా ఇంటిని వెతుకుతుండగా.. రేపట్నుంచి ఆయన భీమవరంలోనే మకాం వేయనున్నారు. పొత్తులు, సీట్ల కేటాయింపులపై ఈ పర్యటనలో శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. అటు పవన్ కోసం భీమిలి, పిఠాపురం, గాజువాక, తిరుపతి, రాయలసీమలోని పలు నియోజకవర్గాలను సైతం జనసైనికులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.