ఇన్నేళ్లలో ఢిల్లీ మొత్తాన్ని బిజెపి చెత్త కుప్పగా మార్చింది : కేజ్రీవాల్‌

యూపీలోని ఘాజీపూర్ లో డంప్ యార్డ్ ను పరిశీలించిన ఢిల్లీ సీఎం

BJP gave nothing to Delhi except mountains of garbage, says Kejriwal at Ghazipur landfill site

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి బిజెపి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ లోని డంప్ యార్డ్ ను పరిశీలించిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. బిజెపి కార్యకర్తలందరూ ఆప్‌లో చేరే రోజు వస్తుందని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో బిజెపి పాలనపై కూడా ఆయన విమర్శలు చేశారు. గత 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ పీఠంపై కూర్చున్న బిజెపి ఢిల్లీని చెత్త కుప్పగా మార్చిందని దుయ్యబట్టారు.

తాను ఘాజీపూర్ లో చెత్త కుప్పలను చూడటానికి వచ్చానని తెలిపారు. పెద్ద పెద్ద చెత్త కుప్పలు తప్పితే ఢిల్లీకి బిజెపి ఇచ్చిందో ఆ పార్టీ కార్యకర్తలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ‘ఒక్కసారి మీ పార్టీని మరచిపోయి దేశం కోసం ఓటు వేయండి’ అని కోరారు. ఏదో ఒకరోజు బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా బిజెపి చెత్త పార్టీ అని, ఆప్ మంచి పార్టీ అని చెబుతారని వ్యాఖ్యానించారు.