సీఎం జగన్ కు కౌంటర్ ఇచ్చిన నాగబాబు..

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీల అధినేతలు తమ ప్రసంగాలకు పదును పెడుతున్నారు. సినిమాలలో ఎలాగైతే భారీ డైలాగ్స్ తో హీరోలు ఆకట్టుకుంటారో..ఇప్పుడు నేతలు కూడా అదే తరహాలో డైలాగ్స్ పేలుస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

నిన్న రాప్తాడు సిద్ధం సభలో జనసేన సింబల్ ఫై సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఫై మెగా బ్రదర్ , జనసేన నేత నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాల‌ని సీఎం జగన్‌ పంచ్‌ డైలాగ్‌లు విసిరారు. దీనికి కౌంటర్ నాగబాబు.. ‘గ్లాస్ సింక్లో ఉన్నా.. తెల్లారితే మళ్లీ తేనీటి విందునిస్తుంది. కానీ ఫ్యాన్ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వదు. అయినా సారూ.. మీరు పబ్లిక్ మీటింగ్ లో ప్రాసలు, పంచుల మీద పెట్టిన శ్రద్ధలో సగం ప్రజా పరిపాలన మీద పెట్టుంటే బాగుండేది’ అని నాగబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు.