ఈ అణచివేత చర్యలను ఖండిస్తున్నాః పవన్ కల్యాణ్

ఓ బిజెపి నేత మెడను కాళ్ల మధ్య ఇరికించి నలిపివేసే ప్రయత్నం చేసిన పోలీసు అధికారి

pawan-kalyan-condemns-kavali-incident

అమరావతిః సిఎం జగన్ శుక్రవారం నెల్లూరు జిల్లా కావలి వచ్చిన సందర్భంగా బిజెపి నేతలు నిరసన తెలిపేందుకు యత్నించారు. అయితే, పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపారు. బిజెపి ఓబీసీ మోర్చా నేత సురేశ్ మెడను ఓ పోలీస్ అధికారి తన కాళ్ల మధ్య ఇరికించి నలిపివేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బిజెపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ ఘటన పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. నిరసన గళాలు అణచివేస్తాం… కాళ్ల కింద పడేసి తొక్కుతాం అంటే అది నియంతృత్వమేనని స్పష్టం చేశారు. బిజెపి ఓబీసీ మోర్చా ఏపీ ఉపాధ్యక్షుడు మొగరాల సురేశ్ పట్ల కావలిలో పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు పాలకుల మనస్తత్వానికి అద్దం పడుతోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈ అణచివేత చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అవినీతిపై సురేశ్ చేస్తున్న నిరసనకు అండగా ఉంటామని వెల్లడించారు.