కస్టడీ ఫస్ట్ డే కలెక్షన్స్ మరి దారుణం

కస్టడీ ఫస్ట్ డే కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. ఎంత దారుణం అంటే చైతు మాజీ భార్య సమంత నటించిన శాకుంతలం కంటే తక్కువ గా నమోదు చేసాయి. నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిన కస్టడీ మూవీ శుక్రవారం (మే 12) తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ మొదటి రోజు మొదటి ఆటతోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సెకండ్ షో నుండి థియేటర్స్ హౌస్ ఫుల్ కాలేకపోయాయి.

ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే.. మొదటి రోజు ఏపీ , తెలంగాణ లో కలిపి రూ. 1.82 కోట్లు షేర్ రూ. 3.20 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8 లక్షలు ఓవర్సీస్లో రూ. 60 లక్షలు తమిళ వెర్షన్ కు రూ. 12 లక్షలు వచ్చాయి. ఇలా మొత్తంగా మొదటి రోజు రూ. 2.62 కోట్లు షేర్ రూ. 4.85 కోట్లు గ్రాస్ రాబట్టింది.