మరోమారు అగ్రస్థానంలో బీజేపీ

విరాళాల్లో ఏడోసారీ ‘టాప్’ లో బీజేపీ.. రూ. 785.77 కోట్లతో మరోమారు అగ్రస్థానం

న్యూఢిల్లీ: బీజేపీ విరాళాల సేకరణలో మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. 2019-20లో ఆయా పార్టీలకు విరాళాల ద్వారా సమకూరిన మొత్తానికి సంబంధించిన వివరాలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. ఈ జాబితాలో బీజేపీ రూ.785.77 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, కాంగ్రెస్‌కు రూ. 139 కోట్లు, ఎన్సీపీకి రూ. 59 కోట్లు, సీపీఎంకు రూ. 19.6 కోట్లు, టీఎంసీకి రూ. 8 కోట్లు, సీపీఐకి రూ. 1.9 కోట్లు విరాళాల ద్వారా సమకూరాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, టీఆర్ఎస్‌కు రూ. 89,55,21,348 కోట్లు విరాళంగా రాగా, వైస్సార్సీపీకి రూ. 8,92,45,126, టీడీపీకి రూ. 2,60,64,011, ఎంఐఎంకు రూ. 13,85,000 విరాళాల రూపంలో సమకూరాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/