నటుడు సాగర్ కు కీలక బాధ్యతలు అప్పగింత

సాగర్ ను పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించిన పవన్ కల్యాణ్

pawan-kalyan-appoints-actor-sagar-as-janasena-party-campaign-secretary

హైదరాబాద్‌ః ‘మొగలి రేకులు’ టీవీ సీరియల్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకుని, సినీ నటుడిగానూ ఎంట్రీ ఇచ్చిన ములుకుంట్ల సాగర్ ఇటీవల జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సాగర్ కు జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. సాగర్ ను తెలంగాణలో జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు హైదరాబాదులోని ప్రశాసన్ నగర్ లో ఉన్న జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో, పవన్ కల్యాణ్ నటుడు సాగర్ కు నియామక పత్రాన్ని అందించారు.

తెలంగాణ ఎన్నికల్లో జనసేన-బిజెపి కూటమి సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని , ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని సాగర్ కు పవన్ కల్యాణ్ కు దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.