రిటైర్డ్ ఐఏఎస్ రమేష్ కు ఏపీ సిఐడి నోటీసులు

ఓ కేసు విషయమై 22న విచారణకు హాజరు కావాలని ఆదేశం

AP CID notices to retired IAS Ramesh
AP CID notices to retired IAS Ramesh

Hyderabad: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కు సంబందించిన ఒక కేసు విషయమై రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు చేరున్నారు. కేసు విషయంలో ఈనెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. ఇదిలా ఉండగా పీవీ రమేష్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారి. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అత్యంత కీలకమైన పదవుల్లో పని చేశారు . తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా రాష్ట్ర సర్వీసుకు తీసుకు వచ్చారు. కీలక బాధ్యతలు అప్పగించారు. రిటైరైన వెంటనే ఆయనను సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/