సీఎం జగన్ పై పవన్ వ్యంగ్యాస్త్రాలు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..వైస్సార్సీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ ఫై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పాపం పసివాడు’’ అంటూ సినిమా పోస్టర్ తో జగన్ తీరుపై ఫైర్ అయ్యారు. నిన్న బాపట్ల మత్స్యకార సభలో సీఎం జగన్ పవన్ కళ్యాణ్‌‌ను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేసారు. ఈ క్రమంలో సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పవన్ ట్వీట్ చేశారు. తనకు ఏమీ తెలియదు అన్నట్లుగా జగన్ చెప్పే వాటికే… ‘‘పాపం పసివాడు’’ సినిమా తీయాలంటూ పవన్ కళ్యాణ్ చురకలంటించారు.

“మన ఏపీ సీఎంతో ఎవరైనా ఈ సినిమా(పాపం పసివాడు) తీస్తారని ఆశిస్తున్నాను. అతను చాలా అమాయకుడు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం ఉంది. అతని చేతిలో ‘సూట్‌కేస్’కి బదులుగా, అతను అక్రమంగా సంపాదించిన సంపద కోసం మనీలాండరింగ్‌ను సులభతరం చేసే ఎక్కువ ‘సూట్‌కేస్ కంపెనీలను’ ఉంచండి. ప్రియమైన ఏపీ సీఎం.. మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి కాదు. మీ అక్రమ సంపాదనతో, ప్రజలపై మీరు సాగిస్తున్న హింసతో ‘వర్గ యుద్ధం’ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు.” అంటూ పవన్ ట్వీట్ చేశారు.