పవన్ – సాయితేజ్ మూవీ ఫస్ట్ లుక్ సిద్ధం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని డైరెక్షన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ ముంగిపుకు రావడం తో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలపై మేకర్స్ దృష్టి సారించారు. ఈ తరుణంలో రేపు ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ విడుదల కాబోతుంది.

రేపు సాయంత్రం 4:14 నిమిషాలకు ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ఖరారు చేయలేదు. రేపు టైటిల్ తో కూడిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. పీపుల్ మీడియా బ్యానర్ ఫై ఈ చిత్రం తెరకెక్కుతుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.