జగన్ హెచ్చరికను పట్టించుకోని ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ల యాజమాన్యాలు

కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కేసులు నమోదు అవుతున్న తల్లిదండ్రులు భయం భయంగానే తమ పిల్లలను స్కూల్స్ కు పంపిస్తున్నారు. ఇదిలా ఉంటె ప్రవైట్ స్కూళ్ల ఫీజుల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత ఫీజులు వసూళ్లు చేయాలో ముందే జగన్ ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆదేశాలు జారీచేశారు.

జీవో లు 53, 54 ప్రకారం గ్రామపంచాయతీలో అయితే నర్సరీ నుండి ఐదో తరగతి వరకు 10,000, పట్టణాల్లో 11000, నగరాల్లో 12000 ఫీజులు వసూలు చేయొచ్చు. ఇక ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు గ్రామాలలో 12000, పట్టణాల్లో 15000, నగరాల్లో 18000 ఇవ్వాలని ఫీజులుగా నిర్ణయించారు. హాస్టల్ విద్యార్థులకైతే గ్రామ పంచాయతీలలో 18,000 పట్టణాల్లో 20,000 నగరాల్లో 24 వేల వరకు మాత్రమే ఫీజులను వసూలు చేయాలనీ సూచించింది ప్రభుత్వం. అయితే జగన్ హెచ్చరికలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ల యాజమాన్యాలు.

ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి. వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా ఎలాంటి అధ్యయనం లేకుండా ఫీజులు ఖరారు చేశారని, ఏ విధంగానూ పాఠశాలలను ఈ ఫీజులతో నిర్వహించలేమని కోర్టు మెట్లు ఎక్కారు. ప్రభుత్వం ఫిక్స్ చేసిన ఫీజుల విషయాన్ని పక్కనపెట్టి, పాత విధానం ప్రకారం ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై తెగ ఒత్తిడి తెస్తున్నాయి. ఆఫ్ లైన్ పాఠశాలలు నడిపిస్తున్న క్రమంలో మొత్తం ఫీజులు చెల్లిస్తేనే పిల్లలను భౌతిక తరగతులకు అనుమతి ఇస్తామంటూ తేల్చి చెబుతున్నారు. ఫీజులు కట్టిన పిల్లలకు మాత్రమే భౌతిక తరగతులు నిర్వహిస్తామని, మిగిలిన వారిని రానివ్వమని స్కూల్స్ యాజమాన్యాలు తల్లిదండ్రులకు చెపుతుండడం తో వారంతా అధికారులకు తమ ఆవేదన చెప్పుకోవడం స్టార్ట్ చేసారు. మరి దీనిపట్ల జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.