ప్రీతీ మృతి పట్ల జనసేన అధినేత పవన్ దిగ్బ్రాంతి

సీనియర్ వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య కు పాల్పడ్డ కాకతీయ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ప్రీతీ..ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఐదు రోజుల పాటు మృతువు తో పోరాడినప్పటికీ…మృతువు ను జయించలేక తనువు చాలించింది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమెను నిమ్స్ హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి ప్రత్యేక వైద్య బృందం ఆమెకు చికిత్స అందజేస్తూ వస్తున్నప్పటికీ , ఆమె బాడీ చికిత్స కు సహకరించలేదు. డాక్టర్స్ ఎంతో ట్రై చేసినప్పటికీ , ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆదివారం 9 గంటల 15 నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈమె మృతి పట్ల విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో పాటు రాజకీయ పార్టీల నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రీతీ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం. మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని వివరించారు. మరోపక్క ప్రీతి మృతికి నిరసనగా ఈరోజు తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల బంద్‌ కు పిలుపునిచ్చింది.