కూలిన చర్చిపైకప్పు .. 10 మంది మృతి

Mexico church roof collapses during baptism killing at least 10 people

మెక్సికో: మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ చర్చి పైకప్పు కూలి పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది తీవ్రగాయాలపాలయ్యారు. తామౌలిపాస్‌ రాష్ట్రం సియుడాడ్‌ మదెరో నగరంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక శాంటాక్రూజ్‌ చర్చి లో 100 మందికిపైగా స్థానికులు ఆదివారం కావడంతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో చర్చి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.