చేతికి సెలైన్ తో ఇలియానా..ఫ్యాన్స్ లో ఖంగారు

ఈ మధ్య వరుస పెట్టి హీరోయిన్లంతా రకరకాల వ్యాధిలా బారినపడుతూ సినిమాలకు దూరం అవుతున్నారు. ఈ క్రమంలో పోకిరి ఫేమ్ ఇలియానా సైతం చేతికి సెలైన్ కనిపించేసరికి ఆమెకు ఏమైందో అని అభిమానులు ఖంగారు పడుతున్నారు. తాను అనారోగ్యంతో హాస్పటల్ లో చేరినట్లు ఇలియానా తెలిపింది. డాక్టర్లు తనకు మూడు బ్యాగుల ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించారని, ఒక్క రోజులో ఎంత తేడా! అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతూ, సందేశాలు పంపుతున్న ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు అని వెల్లడించింది. సకాలంలో వైద్యసాయం అందుకున్నానని, ఇప్పుడు తాను బాగానే ఉన్నానని, అభిమానులు తన పట్ల చూపుతున్న ఆదరణకు నిజంగా ముగ్ధురాలినయ్యానని తెలిపింది. కానీ తనకు ఏమైందనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఇలియానా సినిమా ఛాన్సులు లేక ఖాళీగా ఉంది. కెరియర్ మొదట్లో వరుస హిట్లతో అతి తక్కువ టైం లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. కానీ కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న టైం లో ప్రేమ లో పడడం, బాలీవుడ్ ఛాన్సుల కోసం తెలుగు ఛాన్సులు వదిలేయడం తో అమ్మడు కెరియర్ ఆగిపోయింది. ఆ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది కానీ నిరాశ ఎదురైంది.