సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్

నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొద్దీ రోజులుగా సీనియర్ హీరో నరేష్ – పవిత్రాల ఫై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లిళ్లు అయిన వీళ్లు సహజీవనం చేయడంపై కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానల్స్‌ ట్రోలింగ్‌ చేస్తున్నారు. రోజు రోజుకు వీరిపై ట్రోల్స్ ఎక్కువ అవుతుండడం తో పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

తమ పట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ కంప్లెంయిట్​పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.