టాప్ గేర్ నుండి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆది సాయి కుమార్ వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. తాజాగా ఇప్పుడు టాప్ గేర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశికాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఇక ప్రమోషన్లో భాగంగా సినిమాలోని ‘వెన్నెల వెన్నెల’ అంటూ సాగే మెలోడీ గీతాన్ని మేకర్స్ విడుదల చేసారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా , సిద్ శ్రీరామ్ ఆలపించారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ఈ పాట మెలోడీయస్ గా సాగుతూనే యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. సాంగ్ లోని సన్నివేశాలు, మ్యూజిక్ పాటను క్యాచీకగా తయారు చేసాయి.

ఇక ఈ మూవీ లో ఆదికి జోడిగా రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలలో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాకథనాలతో రాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అలరించబోతుందని మేకర్స్ అంటున్నారు.