తొమ్మిదేళ్ల తర్వాత హైదరాబాద్ పోలీస్ కీలక నిర్ణయం

హైదరాబాద్ పోలీస్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ట్రేడ్, పుడ్ లైసెన్స్, ఫైర్ ఎన్‌వోసీతో పాటు పోలీసు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2014 తర్వాత లైసెన్స్‌లను సిటీ పోలీసులు రద్దు చేశారు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత పోలీస్ లైసెన్స్ నిబంధనలను మళ్లీ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

బార్ అండ్ రెస్టారెంట్, కాఫీ షాప్, టీ స్టాల్, కేఫ్, బేకరీ రెస్టారెంట్, ఐస్ క్రీమ్, పార్లర్, స్వీట్ షాప్, జ్యూస్, స్టార్ హోటళ్లు, సెంటర్లు ఇలా అన్ని కూడా లైసెన్సు తప్పనిసరిగా తీసుకోవాలని పోలీస్ శాఖ ఆదేశించింది. అలాగే సినిమా థియేటర్స్ , ఫైర్ క్రాకర్స్, పెట్రోలియం ఉత్పత్తులు ఈ లైసెన్సులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. లైసెన్సుల కోసం వ్యాపారస్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 వరకు గడువుతో లైసెన్సులు జారీ చేయడం జరుగుతుందని వెల్లడించారు.