రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాలు

Parliament sessions to start from tomorrow

న్యూఢిల్లీః రేపట్నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం లో మొదటిసారి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది.

ప్రస్తుత లోక్‌సభకు చివరి సమావేశాలు కావడంతో సుహృద్భావ వాతావరణంలో సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది కేంద్రం. కీలక బిల్లులు అన్నింటికి గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో… ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదానికి తీసుకువస్తున్న కేంద్రం….ఈ బిల్లులు అన్ని ఇప్పటికే ఉభయ సభల్లో ప్రవేశ పెట్టినందున… ఆమోదం తెలిపేందుకు చర్చకు తీసుకురానున్నట్లు సమాచారం అందుతోంది. కొత్తగా తీసుకువచ్చిన భద్రతా ఏర్పాట్లపై కూడ అన్ని పార్టీలకు వివరించనున్నట్లు సమాచారం అందుతోంది. సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరనుంది కేంద్ర ప్రభుత్వం.