పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్

గురువారం ప్రకటించిన పాకిస్థాన్ ప్రభుత్వం

pakistan-new-army-chief-is-lieutenant-general-asim-munir

ఇస్లామాబాద్ః పాకిస్థాన్ సైన్యానికి కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ ను నియమిస్తూ ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించి, ప్రతిభ ఆధారంగా మునీర్ ను ఎంపిక చేసినట్లు రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ గురువారం మీడియాకు వెల్లడించారు. సైన్యంతో పాటు ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయగల ఈ పోస్టుకు ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై కొంతకాలంగా పాక్ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ఆర్మీ చీఫ్ పదవిని ఆశించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని వార్తలు వెలువడ్డాయి. అయితే, దేశ చీఫ్ స్పైగా సేవలందిస్తున్న అసీమ్ మునీర్ ను ప్రభుత్వం ఆర్మీ చీఫ్ పోస్టుకు ఎంపిక చేసింది. కాగా, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పదవీచ్యుతిడిని చేయడంలో సైన్యం పాత్ర ఏమీలేదని ప్రస్తుత చీఫ్ బజ్వా స్పష్టంచేశారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఆరేండ్ల పాటు ఆర్మీ చీఫ్ గా సేవలందించిన బజ్వా ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం బజ్వా మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలేదని తేల్చిచెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/