దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న 6వ విడత లోక్‌సభ ఎన్నికలు

దేశ వ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ జరుగుతుంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 889 మంది ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యూపీలో 14, ప.బెంగాల్లో 8, హరియాణాలో 10, ఢిల్లీలో 7, బిహార్లో 8, ఒడిశాలో 6, ఝార్ఖండ్లో 4, జమ్మూలో ఒక లోక్సభ స్థానానికి, ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో ఐదు దశలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇవాళ (మే 25 శనివారం)ఆరో దశ పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం, పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

కాగా, ఆరో దశ పోరులో హర్యాలో అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ-మహేంద్రగఢ్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో పోలింగ్ జరగనుంది. వీటిలో బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. కురుక్షేత్రను ఆమ్‌ ఆద్మీ పార్టీకి కేటాయించిన కాంగ్రెస్‌, మిగిలిన 9 స్థానాల్లో బరిలోకి దిగింది. కాగా, 2014, 2019లలో ఇక్కడ బీజేపీనే విజయం సాధించింది. ఈసారి బీజేపీ తరఫున మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్ బరిలో ఉన్నారు.