మళ్లీ నన్ను చంపడానికి కుట్రః పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఈ కుట్ర వెనక మాజీ అధ్యక్షుడు జర్దారీ హస్తం ఉందని ఆరోపణ

pakistan-ex-prime-minister-imran-khan-accuses-asif-ali-zardari-of-paying-terrorists-to-assassinate-him

ఇస్లామాబాద్‌ః పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు మళ్లీ పథక రచన జరుగుతోందన్నారు. ఈసారి మాజీ అధ్యక్షుడు జర్దారీ కుట్ర పన్నారని అన్నారు. అందులో భాగంగా ఓ ఉగ్రవాద సంస్థకు భారీగా నిధులు ఇచ్చారని పేర్కొన్నారు. సింధ్ ప్రభుత్వం నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్మును జర్దారీ తన హత్యకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

అంతేకాదు, గతంలో తన హత్యకు కుట్ర పన్నిన వారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని ఇమ్రాన్ అన్నారు. వజీరాబాద్‌లో తనపై ‘ప్లాన్-బి’ అమలు చేసి అంతమొందించాలని చూశారని, అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డానని గుర్తు చేశారు. ‘ప్లాన్-బి’ విఫలం కావడంతో ఇప్పుడు ‘ప్లాన్-సి’ అమలు చేస్తున్నారని అన్నారు. ఓ ఉగ్ర సంస్థకు పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చారన్నారు. ఈ కుట్రలో ప్రభుత్వ ఏజెన్సీల పాత్ర కూడా ఉందని ఇమ్రాన్ ఆరోపించారు. కాగా, గతేడాది నవంబరు 3న ఇమ్రాన్‌పై జరిగిన దాడిలో ఆయన కుడికాలికి బుల్లెట్ గాయమైంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/