తారకరత్న హెల్త్ ఫై స్పందించిన కళ్యాణ్ రామ్

నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కు మద్దతు తెలుపుతూ..తారకరత్న శుక్రవారం పాదయాత్రలో పాల్గొన్నారు. పాల్గొన్న కాసేపటికే నడుచుకుంటూ..నడుచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆయన్ను హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం బెంగుళూర్ లోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఈ తరుణంలో నందమూరి కళ్యాణ్ రామ్ ..తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఫై స్పందించారు.

ట్విట్టర్ వేదికగా.. “నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ” అని ట్విట్ చేశారు. కాగా తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో ఆయన ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తున్నారు. మరోవైపు మధ్యలో నిర్మాణాలను నిలిపివేసిన కురుబ, వాల్మీకి వర్గాలకు చెందిన కమ్యూనిటీ హాల్స్ ను ఆయన పరిశీలించారు. ఈ భవనాలను పూర్తి చేయాలని అధికారులను కోరినా అధికారులు పట్టించుకోలేదని వారు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ..టీడీపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పేదొకటి, చేసేది మరొకటని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలస్ లో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక దొంగరెడ్డి, ఉత్తరాంధ్రను దోచుకునే మరో రెడ్డి ఉంటారని అన్నారు. ఈ నలుగురు మాత్రమే తాడేపల్లి ప్యాలస్ లో ఉంటారని… వైసీపీ బీసీ నేతలు మాత్రం గేటు బయటే ఉంటారని చెప్పారు.