లోకేష్ పాదయాత్ర అపశృతులతో మొదలైందంటూ మంత్రి సిదిరి అప్పలరాజు విమర్శలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ‘యువగళం ‘ పేరుతో పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. నిన్న శుక్రవారం కుప్పం నుండి ఈ పాదయాత్ర మొదలైంది. కాగా ఈ పాదయాత్ర ఫై వైస్సార్సీపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర అపశృతులతో మొదలైందంటూ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. నేడు శనివారం రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అర్సపల్లి సూర్యనారాయణ స్వామిని మంత్రి అప్పలరాజు దర్శించుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ…లోకేష్ పాదయాత్రకు ఒక లక్ష్యం అంటూ లేదని .. మన ఆలోచన సరిగా లేకపోతే చేసే ప్రయత్నం కూడా వృధా అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికలలో గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నారని.. దీనివల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

అలాగే నటి శ్రీ రెడ్డి సైతం లోకేష్ పాదయాత్ర ఫై పలు వ్యాఖ్యలు చేసారు. నారా లోకేష్‌ ఓ ఐరన్‌ లెగ్‌ అంటూ లోకేష్‌ ఫోటోను షేర్‌ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ మతిలేనోడు అయితే, నారా లోకేష్‌ ఐరన్‌ లెగ్‌ అన్నారు. ఇదిలా ఉంటె లోకేష్ పాదయాత్ర మొదటి రోజే అపశృతి చోటుచేసుకుంది. నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం బెంగుళూర్ లోని ఓ హాస్పటల్ లో చికిత్స అందిస్తున్నారు.