పబ్జీ గేమ్ పై పాక్‌ కీలక నిర్ణయం

పబ్జీ గేమ్ ను నిషేధిస్తున్నట్టు ప్రకటన

పబ్జీ గేమ్ పై పాక్‌ కీలక నిర్ణయం
PUBG ban in Pakistan

ఇస్లామాబాద్‌: పబ్జీ గేమ్ ను నిషేధిస్తున్నట్టు పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ టెలి కమ్యూనికేషన్ అథారిటీ ప్రకటించింది. పబ్జీ గేమ్ ఒక వ్యసనమని… దాని వల్ల సమయం వృథా అవుతుందని తెలిపింది. పబ్జీ గేమ్ చిన్నారులు, యువతను ఆత్మహత్యల దిశగా ప్రేరేపిస్తోందని, దాన్ని బ్యాన్ చేయాలనే డిమాండ్ పాక్ లో చాలా కాలంగానే వినిపిస్తోంది. మిషన్ పూర్తి చేయడంలో విఫలం కావడంతో… 16 ఏళ్ల పాకిస్థాన్ బాలుడు ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ గేమ్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్లు మరింత పెరగడమే కాక, లాహోర్ హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు… దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో, ఈ గేమ్ ను తాత్కాలికంగా బ్యాన్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/