వాణిజ్య ఒప్పందంపై రాని క్లారిటీ

Donald Trump_Modi
Donald Trump_Modi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన కొంత ఆనందాన్ని, మరి కొంత విషాదాన్ని మిగిల్చింది. మొదటి రోజు 20 నిమిషాల పాటు అహ్మాదాబాద్‌ స్టేడియంలో ప్రసంగించారు. భారత్‌తో తనకు ఉన్న సంబంధాల గురించి వివ రిస్తూనే ఇస్లామిక్‌ టెర్రరిజంపై వార్నింగ్‌ ఇచ్చారు. అంతేకాదు భారత్‌కు పెద్ద ఎత్తున ఆయు ధాలు సరఫరా చేస్తామని చైనాకు చెప్పకనే వార్నింగ్‌ ఇచ్చారు. అయితే ట్రంప్‌ భారత్‌ పర్యటనలో వాణిజ్య ఒప్పందం కుదుర ుతుందని భావించారు.

కానీ ఈ ఒప్పందం మాత్రం కుదరలేదు. మొత్తానికి పర్యటన గమనిస్తే రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను నానాటికీ బలపడుతూనే వచ్చాయని అర్థమ వ్ఞతుంది. భారత్‌తో 25 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు. భారత్‌ తమ ఎగుమతులపై భారీ సుంకాలు విధిస్తోందని, వాటిని తగ్గించుకో వాలన్నారు. ప్రధానంగా ఇరు దేశాలు సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేయడంతో వాణిజ్య ఒప్పందం మాత్రం కుదరలేదు. ఒప్పందం కుదరనప్పటికీ ఆ దిశగా ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగే అవకాశం ఉంది.

చైనాకు చెక్‌పెట్టడం కోసమే భారత్‌తో రూ.21వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఎంహెచ్‌60 రోమియో సీహాక్‌ హెలికాప్టర్లు శత్రు జలాంతర్గాములను పసిగట్టి దాడులు చేయడానికి ఉపకరిస్తాయి. అమెరికా నుంచి మూడు బిలియన్‌ డాలర్ల విలువైన హెలికాప్టర్లు, ఇతర సైనిక పరికరాలను కొనుగోలు చేయడం కోసం భారత్‌ ఒప్పందం చేసుకుంది. భారత్‌కు అత్యాధునిక అపాచీ, ఎంహెచ్‌ 60 రోమియో హెలికాప్టర్లను అందచేస్తామని ట్రంప్‌ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే మూడేళ్లలో భారత్‌కు 24 ఎంహెచ్‌ 60 రోమియో సీహాక్‌ హెలికాప్టర్లను, 12 ఏహెచ్‌ 64ఈ అపాచీ హెలికాప్టర్లను అమెరికా సరఫరా చేయనుంది.

ఏహెచ్‌ 64ఈ అపాచీ హెలి కాప్టర్లను బోయింగ్‌ సంస్థ భారత్‌లోనే తయారు చేయనుంది. వీటికి అవసరమైన కొన్ని విడిభాగాలను బోయింగ్‌ టాటా అనుబంధ సంస్థ హైదరాబాద్‌లో తయారు చేయనుంది. ఆరోగ్య, ఇంధన రంగాల్లో ఇరు దేశాలు మూడు ఒప్పందాలు చేసుకున్నాయి.

మానసిక ఆరోగ్యంపై భారత్‌, అమెరికా ఎంవోయూపై సంతకాలు చేశాయి. వైద్య ఉత్పత్తుల భద్రతపై అమెరికా ఆహార మందుల శాఖ పరిధిలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌తో ఎంఒయూ కుదిరింది. ఇంధన రంగంలో సహకారంపై ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఎక్సాస్‌ మొబైల్‌ ఇండియా ఎల్‌ఎన్‌జి లిమిటెడ్‌, అమెరికాకు చెందిన చార్ట్‌ ఇండస్ట్రీస్‌ ఇంక్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఎక్సాస్‌ మొబిల్‌తో కుదిరిన ఒప్పందం కారణంగా భారత్‌ అమెరికా నుంచి మరింతగా లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది.

ఆప్ఘన్‌ ఒప్పందం.. భద్రతకు ముప్పు

స్వర్గీయ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1998లో అణుపరీక్ష జరిపినందుకు అప్పటి అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ మనదేశంపై ఆంక్షలు విధించారు. మరో రెండేళ్ల తర్వాత వాటిని పాక్షికంగా తొలగించి భారత్‌లో అయిదు రోజుల పర్యటనకు వచ్చారు. మొత్తంగా రెండు దేశాల మధ్య ఈ రెండు దశాబ్దా లుగా కొనసాగుతున్న స్నేహసంబంధాలను నానాటికీ బలపడు తూనే వచ్చాయి.

జార్జిబుష్‌ ఏలుబడిలో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకున్నాక ఈ సంబంధాలు కీలక మలుపు తిరిగాయి. తాజా చర్చల్లో ఇరుదేశాల సంబంధాలనూ అంత ర్జాతీయ సమగ్ర భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయిం చడం కూడా అటువంటిదే. అయితే తాలిబన్‌లతో అమెరికా కుదుర్చుకోబోయే ఒప్పందం హాట్‌టాపిక్‌గా మారింది. అప్ఘాన్‌లో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తప్పించి, అధికారం తాలిబన్‌ల చేతిలో పెడితే అది భారత్‌కు తలనొప్పిగా మారుతుంది. కానీ ఏదో విధంగా సమస్య పరిష్కారం అయినట్టు చూపించి నిష్క్రమిం చాలని అమెరికా తొందరపడుతోంది.

ఆప్ఘాన్‌లో శాంతిస్థాపన, భద్రతకు భారత్‌ పూర్తిగా సహకరిస్తుందని అమెరికా ఆశిస్తుండగా ఆఫ్ఘాన్‌ శాంతి ప్రక్రియలో పాకిస్థాన్‌ను పక్కనబెట్టి, సరిహద్దు ఉగ్రవాదాన్ని నిరోధించాలని భారత్‌ భావిస్తోంది. అమెరికా, ఆప్ఘానిస్థాన్‌ మధ్య కుదిరే చారిత్రాత్మక శాంతి ప్రక్రియ తమ సమక్షంలో కుదురుతుందని, ఎందుకంటే తమ పాత్ర లేకుండా ఈ ఒప్పందం కుదురడం అసాధ్యమని అన్నారు.

దీంతో పాక్‌ను ఇందులో భాగస్వామికాకుండా చూడాలని భారత్‌ ప్రయత్ని స్తోంది. ఒకపక్క భారత్‌తో సాన్నిహిత్యాన్ని నెరపుతూనే, పాక్‌ ప్రాపకంతో తాలిబన్‌లతో ఒప్పందానికి సిద్ధపడుతోంది.

ఈ క్రమంలో భారత్‌ వైఖరిని పరిగణనలోకి తీసుకోకపోవడం, ఈ ప్రాంత భద్రతకు తగిన హామీ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. మొత్తానికి అగ్రరాజ్యధినేత రెండు రోజుల పర్యటన భారత్‌కు ఒకింత మోదం, మరొకింత ఖేదం కలిగించిందనడంలో సందేహం లేదు.

  • పులవర్తిప్రభు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/