జియోలో ఇంటెల్‌ రూ.1,894 కోట్ల పెట్టుబడి

Intel-Capital-invests-in-Jio-Platforms

మంబయి: ప్రముఖ టెలికాం రంగ సంస్థ జియోలోకి పెట్టుబడుల పర్వం కొనసాగుతుంది. తాజాగా అమెరికాకు చెందిన ఇంటెల్‌ రూ.1894.50 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చింది. దీంతో జియోలో ఇంటెల్‌ సంస్థ 0.39 శాతం వాటా దక్కించుకోనుందని ఆర్‌ఐఎల్‌ ప్రకటిచింది. జియోలో గత 11 వారాల్లో పెట్టుబడులు పెట్టిన 12వ సంస్థగా ఇంటెల్‌ నిలిచింది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలైన ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌, విస్తా ఈక్విటీ పార్ట్‌నర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌, కేకేఆర్‌, ముబదలా, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, టీపీజీ, ఎల్‌ కాటర్టన్‌, పీఐఎఫ్‌ సంస్థలు పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజా ఒప్పందంతో కలిపి ఇప్పటివరకు జియో రూ.1,17,588.45 కోట్ల పెట్టుబడులు సాధించినట్లయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సాంకేతిక కంపెనీలతో పనిచేసిన అనుభవం ఇంటెల్‌ క్యాపిటల్‌కు ఉందని ముకేశ్‌ అంబానీ అన్నారు. అది భారత ప్రజలకు అత్యాథునిక సాంకేతికతను చేరువచేయడంలో జియోకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. 


తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/