ఇరాన్‌కు అదును చూసి ఝలక్‌ ఇచ్చిన పాకిస్థాన్‌!

Imran Khan
Imran Khan

ఇస్లామాబాద్‌: ఇరాన్‌కు పాకిస్థాన్‌ గట్టి దెబ్బ కొట్టిందనే చెప్పాలి. అదును చూసి ఇరాన్‌కు పాకిస్థాన్‌ ఝలక్‌ ఇచ్చింది. అమెరికా-ఇరాన్‌ మధ్య జరుతున్న దాడి ప్రతిదాడుల పరిస్థితిని పాక్‌ తనకు అనుకూలంగా మార్చుకొని తాను కోరుకున్నది సాధించుకుందని ఓ పత్రిక సంచలన నివేదిక ప్రచురించింది. అయితే గతంలో ఇరాన్‌ నిఘా వర్గాలు బలోచ్‌ ప్రాంతంలోని పాక్‌ బలగాలపై దాడిలో ఇరాన్‌ హస్తం ఉందని పాక్‌ భావిస్తోంది. కానీ అప్పట్లో పరిస్థితుల రీత్యా పాక్‌ ఏమి మాట్లాడలేకపోయింది. ఇటీవల మృతి చెందిన ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానియే అప్పటి దాడులకు సూత్రధారి అని కూడా పాక్‌ ఆరోపించింది. ఈ క్రమంలో అమెరికా జరిపిన దాడిలో ఖాసీం మృతి చెందడంతో పాక్‌కు ఊహించని అవకాశం లభించిందని ఆ సంస్థ పేర్కొంది. ఖాసీం మృతికి మౌనం పాటించిన పాక్‌ తన మద్దతు మాత్రం అమెరికాకు ఇచ్చింది. అంతేకాకుండా ఎంతో కాలంగా ఇరు దేశాల మధ్య మరుగున పడ్డ మిలటరీల సహకారాన్ని పునరుద్ధరించాలని అమెరికాను పాక్‌ కోరిందని సంస్థ ప్రచురించింది. ఈ క్రమంలోనే తమ మిలటరీ శిక్షణా సంస్థల్లో పాక్‌ దళాలకు శిక్షణ అందించే ఐఎమ్‌ఈటి కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణాసియా వ్యవహారాల శాఖ ఇన్‌చార్జ్‌ ట్వీట్‌ చేశారని తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/