కరోనా సెకండ్ వేవ్ మహా తీవ్రం!
పల్మోనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సచిన్

New Delhi: కరోనా వైరస్ మళ్లీ వస్తోంది. సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వుంటుందని ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సచిన్ అన్నారు.
మహమ్మారి బారినపడి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ వైరస్ సోకుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా రెరడోసారి సోకే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఖతార్ దేశ విభాగం స్పందించింది.
దీనిపై ఖతార్ ప్రజారోగ్య శాఖ, ఖతార్ కార్నెల్ యూనివర్సిటీతో కలిసి పరిశోధన చేసిన డబ్ల్యూహెచ్‌ఓ.. రెరడోసారి కరోనా వచ్చే అవకాశాలు 0.04 శాతం మాత్రమేనని వెల్లడించింది.
ప్రతి 10వేల మందిలో నలుగురికి మాత్రమే కరోనా మళ్లీ సోకే అవకాశాలు ఉన్నాయని వివరించింది.
అయితే బెంగళూరులోని 28 ప్రభుత్వ, పైవేటు హాస్పిటళ్లలో ఏడుగురు వైద్యులు సుమారు 35 మందికి మళ్లీ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు గుర్తించారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/