చర్చిలో తొక్కిసలాట..20 మంది మృతి

Tanzanian church
Tanzanian church

నైరోబీ (కెన్యా): టాంజానియాలోని ఉత్తర భాగంలో వున్న ఒక ఓపెన్‌ ఎయిర్‌ చర్చ్‌లో శనివారం చోటు చేసుకున్న తొక్కిసలాటలో కనీసం 20 మంది మరణించారని అధికారులు చెప్పారు. టాంజానియా ఉత్తర ప్రాంతానికి చెందిన మోషి నగర జిల్లా కమిషనర్‌ కిప్పి వరియోబా ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ 20 మంది మరణించినట్లు తెలుస్తోందని, ఈ తొక్కిసలాటలో అనేక మంది గాయపడ్డారని, అందులో కొందరి పరిస్థితి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నామని ఆయన చెప్పారు. శనివారంనాడు చర్చ్‌ ప్రార్థనకు వచ్చిన వారు చర్చ్‌ అపోస్తల్‌ బొనిఫాస్‌ మ్వామ్‌ఫోసా ‘పవిత్ర నూనె’ను నేలపై పోయటంతో, దానిని తాకేందుకు అస్వస్థతతో వున్న కొందరు ప్రయత్నించినపుడు ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/