‘టామ్‌ అండ్‌ జెర్రీ’ సృష్టికర్త జీన్‌ డయిచ్‌ కన్నుమూత

యానిమేషన్ రంగంలో ఆయన సేవలు చిరస్మరణీయం

Tom an Jerry's creator Gene Deitch
Tom an Jerry’s creator Gene Deitch

‘టామ్‌ అండ్‌ జెర్రీ’ చిత్రాల రచయిత, దర్శకుడు జీన్‌ డయిచ్‌ (95) jకన్నుమూశారు. అమెరికాలోని చికాగోలో ఆగస్టు 8, 1924లో ఆయన జన్మించారు. 1959 నుండి చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రాగ్‌లో సెటిలయ్యారు.

గురువారం రాత్రి సొంత అపార్ట్‌మెంట్‌లో జీన్‌ డయిచ్‌ మరణించారని, ఆయన చెక్‌ రిపబ్లిక్‌ పబ్లికేషన్‌ పీటర్‌ హిమ్మల్‌ తెలిపారు.

ఆయనకు ఓ భార్య, ముగ్గురు కుమారులు. పిల్లలు అందరూ కార్టునిస్టులు, ఇల్లస్ట్రేటర్సే. యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో జీన్‌ డయిచ్‌ రూపొందించిన ‘మున్రో’ 1960లో అస్కార్‌ అవార్డు అందుకుంది.

తర్వాత ‘హౌ టు అవాయిడ్‌ ఫ్రెండ్షిప్‌’, ‘హియర్‌ ఈజ్‌ నుడ్‌నిక్‌’ చిత్రాలకు గాను అదే విభాగంలో రెండుసార్లు ఆయనకు ఆస్కార్‌ నామినేషన్‌ లభించింది.

ఆయన కో-ప్రొడ్యూస్‌ చేసిన ‘సిడ్నీస్‌ ఫ్యామిలీ ట్రీ’ 1958లో ఆస్కార్స్‌కి నామినేట్‌ అయింది.

టామ్‌ అండ్‌ జెర్రీ’లో 13 ఎపిసోడ్స్‌కి, ‘పోపాయి ద సైలర్‌’లో కొన్ని ఎపిసోడ్స్‌కి ఆయన దర్శకత్వం వహించారు.

యానిమేషన్‌  రంగానికి చేసిన సేవలకు గాను 2004లో జీన్‌ డయిచ్‌ విన్సర్‌ మెక్‌కే అవార్డు అందుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/