24 గంటల్లో 4 లక్షలకు పైగా కరోనా కేసులు
3,523 మంది మంది మృతి

New Delhi: గడిచిన 24 గంటల్లో దేశంలో 4 లక్షలపైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజే 4,01,993 మందికి పాజిటివ్ తేలింది. 3,523 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,91,64,969కు చేరింది. దేశవ్యాప్త రికవరీ రేటు 81.84 శాతానికి పడిపోగా.. మరణాల రేటు 1.11 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. . దేశవ్యాప్తంగా శుక్రవారం 19.45 లక్షల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/