‘బాబూ… ఓ రాంబాబు..అంటూ నాగబాబు మెగా కౌంటర్

జనసేన నేత , పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ లో యాక్టివ్ గా ఉంటూ..పార్టీ ఫై విమర్శలు చేసేవారికి సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుంటాడు. తాజాగా వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు..పవన్ కళ్యాణ్ ఫై చేసిన కామెంట్స్ కు తనదైన స్టయిల్ లో కౌంటర్ ఇచ్చారు నాగబాబు.

ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలెంజ్ ను అందుకుని చేనేత దుస్తులు ధరించిన సంగతి తెలిసిందే. అయితే.. వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు… కాటన్ దుస్తుల చాలెంజ్ లు ఆపి, 175 సీట్లకి పోటీచేస్తున్నారా? లేదా? అనేది స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా ప్రకటించండి అంటూ డిమాండ్ చేశారు. దీనిపై నాగబాబు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. ‘బాబూ… ఓ రాంబాబు! ఎన్నిస్లారు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా’ అంటూ వ్యాఖ్యానించారు.

జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి, వైస్సార్సీపీ సర్కస్ లో నీలాంటి బఫూన్ గాళ్లు అడిగే క్లారిఫికేషన్స్ కు సమాధానం చెప్పే ఓపిక, తీరిక తమ జనసైనికులకు లేవని, తమ ప్రెసిడెంట్ కు అంతకన్నా లేదని నాగబాబు స్పష్టం చేశారు. అలాగే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సైతం అంబటి రాంబాబు కామెంట్స్ కు స్పందించారు. రంభల రాంబాబు గారు మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారంటూ రివర్స్‌ అటాక్‌ చేశారు. ప్రస్తుతం గణేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.