జీహెచ్ఎంసీ పరిధిలో 1,507 కేసులు
వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ వెల్లడి

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 7,754 కరోనా కేసులు నమోదయ్యాయి. 51 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,507 కేసులు నమోదు అయినట్టు శనివారం వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 4,43,360 కరోనా కేసులు నమోదు కాగా, 2,312 మంది మృత్యువాత పడ్డారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/