ఎయిమ్స్‌ను సందర్శించిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

Minister of State For Home Affairs Kishan Reddy – Visited AIIMS at Bibinagar

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ను శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సందర్శించారు. అక్కడ మొక్క నాటి నీళ్లుపోశారు. అనంతరం ఎయిమ్స్‌ పురోగతిపై ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా, జిల్లా కలెక్టర్‌తో పాటు మిగతా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎయిమ్స్‌లో లోటుపాట్లను తెలుసుకునేందుకు సందర్శించినట్లు పేర్కొన్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

మోడి సర్కారు అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా తొమ్మిది ఎయిమ్స్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ నిర్మాణానికి స్థలం కేటాయింపై కేంద్రమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం భవనాన్ని ఎయిమ్స్‌కు బదలాయించాలని కోరారు. ఎయిమ్స్‌ నిర్మాణం, ఉద్యోగ, మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభమైందని, భవిష్యత్‌ మరింత తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. వైద్య కళాశాల పూర్తయితే 750 మంది విద్యనభ్యసిస్తారని తెలిపారు. నెల రోజుల్లో ఓపీ బ్లాక్‌ను పునః ప్రారంభిస్తామని, ఆయుష్‌ కేంద్రా సైతం ఏర్పాటు చేస్తామని వివరించారు. వైద్య కళాశాల ప్రాంగణంలో బ్యాంక్‌, పోస్టాఫీస్‌ సైతం అందుబాటులో ఉంచుతామన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/