పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గండిపొరా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. గండిపొరాలో ఉగ్రవాదులున్నారని అందిన సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సోమవారం సాయంత్రం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.

దీంతో ఓ ఉగ్రవాది మరణించాడని, మరో ఉగ్రవాది దాక్కున్నాడని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వారిని జైషే మహమ్మద్‌ (JEM) ఉగ్రవాదులు గుర్తించామన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్నదని వెల్లడించారు.:

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/