తెలంగాణ ప్రభుత్వాని ప్రశ్నించిన ఏపీ బీజేపీ నేత

అసదుద్దీన్​ అనుచరులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్నారు… ఇవి మీకు పట్టవా కేటీఆర్?..విష్ణువర్ధన్

హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అనుచరులు బహిరంగంగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియాను ట్విట్టర్లో షేర్ చేశారు.

ఇందులో ఓ భవనం ముందు కొంతమంది ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. వీరంతా ఓవైసీ అనుచరులని విష్ణువర్థన్ పేర్కొన్నారు. ఇలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జాతీయవాదం గురించి ప్రతి ఒక్కరికీ పాఠాలు చెబుతారు. కానీ ఇలాంటి వీడియోలు కనిపించినప్పుడు మాత్రం తమ దుర్మార్గపు రాజకీయాలను కొనసాగించడానికి వెంటనే దాక్కుంటారు’ అని ట్వీట్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/