హెలికాప్టర్ ప్రమాద ఘటన స్థలికి వెళ్లనున్న సీఎం స్టాలిన్

హెలికాప్టర్ లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన అర్ధాంగి

చెన్నై : తమిళనాడులో నీలగిరి వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఆ హెలికాప్టర్ లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన అర్ధాంగితోపాటు పలువురు సైనికాధికారులు ఉన్నారు. మొత్తం 14 మంది హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా, 11 మంది మరణించగా, ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో బిపిన్ రావత్ కూడా ఉన్నారు. కాగా, ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ వెంటనే స్పందించారు. ఘటన స్థలికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సాయంత్రం చెన్నై నుంచి కోయంబత్తూరు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నీలగిరి వెళతారు.

కాగా, ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ సాక్షి కథనం ప్రకారం…. మంటల్లో చిక్కుకున్న హెలికాప్టర్ ను చూశామని చెప్పారు. హెలికాప్టర్ కూలిపోతున్న సమయంలో చెట్ల మీదుగా ముగ్గురు వ్యక్తులు కిందికి పడిపోవడం గమనించామని, అయితే మంటలు వ్యాపించడంతో తాము వెళ్లలేకపోయామని ఆ వ్యక్తి వెల్లడించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/