దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,55,749కి చేరాయి. ఇందులో 4,26,13,440 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,24,611 మంది మరణించగా, 17,698 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 25 మంది మృతిచెందారని, 2070 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు 1,93,13,41,918 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 85,00,77,409 నమూనాలను పరీక్షించామని, ఆదివారం ఒక్కరోజే 2,78,267 మందికి పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్‌ తెలిపింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/