కొలిక్కి వచ్చిన చమురు ధరల పోరు

చమురు ఉత్పత్తిని తగ్గించేందకు అంగీకారం

crude oil
crude oil

లండన్‌: గత కొద్ది రోజులుగా సౌదీ అరేబియా, రష్యాల మధ్య నెలకొన్న చమురు ధరల యుద్దానికి తెరపడిందది. ధరలు తగ్గించేందుకు, చమురు ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌), రష్యా తో సహ ఇతర కీలక దేశాల మధ్య ఒప్పందం ఖరారు అయింది. దీని ప్రకారం 9.7 మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించడానికి అంగీకరించారు. కాగా ఈ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వాగతించారు. ఈ మేరకు సౌదీ అరేబియా, రష్యా దేశాధినేతలను అభినందించారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు డిమాండ్‌ బాగా తగ్గిపోయింది. దీంతో ధరల్ని అదుపు చేసేందకు ఉత్పత్తిని తగ్గించాలని సౌదీ అరెబియా నిర్ణయించగా రష్యా వ్యతరేఖించింది. దీంతో ఇరుదేశాల మధ్య ధరల యుద్దం మొదలయింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు బారీగా పడిపోవడంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడింది. తాజాగా ఏర్పడిన ఒప్పందంతో చమురు మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/