పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్

ఓటర్ల స్పందన తెలుసుకున్న రమేష్ కుమార్

State Election Commissioner visiting polling stations
State Election Commissioner visiting polling stations

Vijayawada: రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఓటింగ్ సరళి పరిశీలనలో భాగంగా విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తో కలిసి సీవీఆర్ స్కూల్లో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కూడా సందర్శించారు. వృద్ధులు, యువకులు, మహిళా ఓటర్లతో మాట్లాడిన కమిషనర్, పోలింగ్ , క్యూలైన్ల వివరాలుపై ఓటర్ల స్పందన తెలుసుకున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/