ఏపిలో కొత్తగా మరో 12 కరోనా కేసులు
432 కు చేరిన మొత్తం కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య మరింతగా పెరిగింది. నిన్న రాత్రి నుంచి జరిపిన పరీక్షలో కొత్తగా మరో 12 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 432 కు చేరిందని ఏపి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నిన్న రాత్రి 9 గంటల నుండి ఈ రోజు ఉదయం వరకు జరిగిన కోవిడ్ 19 పరీక్షల్లో గుంటూరులో 8, చిత్తూరులో 2, కృష్ణా మరియు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కోకేసుల నమోదు అయ్యాయి. కొత్తగా నమోదయిన 12 కేసులతో రాష్ట్రంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య 432 కు పెరిగింది అని ట్విట్టర్‌లో పేర్కోంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 90 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, రెండవ స్థానంలో కర్నూలు జిల్లాలో 84 కేసులు నమోదు అయ్యాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/