రైలు పట్టాలపై కుప్పకూలిన విమానం..ఢీ కొట్టిన ట్రైన్

కాలిఫోర్నియా: అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పైలట్‌ చిన్ని విమానాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇంతలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్‌ ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశాడు. అయితే అతను తప్పని పరిస్థితిలో సరిగ్గా రైలు, రోడ్డు క్రాస్‌ అయ్యే చోట విమానం ల్యాండ్‌ చేశాడు. అయితే ఆ విమానం సరిగా ల్యాండ్‌ అవకపోవడంతో పైలట్‌ విమానంనుంచి బయటకు రాలేకపోయాడు. ఇది గమనించిన ఇద్దరు ఫుట్‌హిల్ డివిజన్ ఆఫీసర్లు వేగంగా అతని దగ్గరకు పరుగెత్తుకు వెళ్లారు. విమానంలో ఇరుక్కున్న అతన్ని అతి కష్టంమీద బయటకు తీసి… మోసుకుంటూ వేగంగా పరుగెత్తారు.. సరిగ్గా అదే టైమ్‌లో వాయువేగంతో వచ్చిన రైలు విమానాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఆ ఆఫీసర్లు అంత వేగంగా స్పందించకపోయి ఉంటే… ఆ పైలట్ ప్రాణాలు పోయేవే. అందుకే నెటిజన్లు వాళ్లను మెచ్చుకుంటున్నారు. వాళ్ల బాడీక్యామ్‌లో రికార్డైన వీడియోని వైరల్ చేస్తున్నారు.

https://twitter.com/LAPDHQ/status/1480363436311670784

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/