ఎంపీ రఘురామ ఇంటికి సీఐడీ పోలీసులు..

ఎంపీ రఘురామ ఇంటికి సీఐడీ పోలీసులు..
YSRCP MP Raghurama Krishnam Raju

గచ్చిబౌలిలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. ఈయనపై రాష్ట్రంలో నమోదైన కేసుల విషయంలో నోటీసు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు రాకను తెలిసి కూడా ఆయన ఇంట్లో నుండి బయటకు రాకపోయేసరికి పోలీసులు ఇంటి బయట వేచి ఉన్నారు.

రఘురామ కృష్ణరాజుపై గతంలో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ కూడా చేశారు. అయితే రఘురామ కృష్ణరాజు బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ కేసు విచారణకు సంబంధించి మరోసారి విచాణకు రావాల్సిందిగా రఘురామకృష్నరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం. రేపు గురువారం విచారణకు హాజరు కావాలని నోటీసు లలో పేర్కొన్నారు.