భారత్ బంద్ కు తెరాస మద్దతు : కేసీఆర్

రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి

TRS supports Bharat Bandh: KCR
TS CM KCR

Hyderabad: ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ సమర్థించారు.

రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు.

కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

భారత్ బంద్ విజయవంతానికి టిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్ ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/