ఏపీలో రాత్రి కర్ఫ్యూ ను వాయిదా వేసిన సర్కార్

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్..కరోనా కట్టడి లో భాగంగా సోమవారం నుండి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలనీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. సంక్రాంతి తర్వాత దీనిని అమలు చేయాలనీ నిర్ణయించారు. ఈ నెల 18 తర్వాత దీని అమలు చేయాలనీ చూస్తున్నారు. సడెన్ గా రాత్రి కర్ఫ్యూ వాయిదా వేయడానికి కారణంగా సంక్రాంతి పండగే.

ఏపీలో సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడ ఉన్న సరే..సంక్రాంతికి సొంత ఉరికి వచ్చి పండగను కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి కి కూడా అలాగే జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి కర్ఫ్యూ ను అమలు చేయడం వారికీ ఇబ్బందిగా మారనుంది. అందుకే సర్కార్ రాత్రి కర్ఫ్యూ ను వెనక్కు తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే కర్ఫ్యూ వాయిదా వేసినట్లు ఏపీ మంత్రి ఆళ్లనాని తెలిపారు. థర్డ్‌ వేవ్‌ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు.