ఒడిశా గవర్నర్‌ దంపతులకు కరోనా

Odisha Governor Prof Ganeshi Lal and Wife Test Covid Positive

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్ర గవర్నర్ గణేష్ లాల్ దంపతులు కరోనా బారిన పడ్డారు.  వారితో పాటు మరో నలుగురు కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకింద‌ని రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో వారంతా భువ‌నేశ్వ‌ర్‌లోని ఎస్‌యూఎం కోవిడ్ ద‌వాఖాన‌లో చేరార‌ని అధికారులు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి బాగానే ఉంద‌ని తెలిపారు. కాగా, ఈ మ‌ధ్య‌కాలంలో గ‌వ‌ర్న‌ర్ దంపతుల‌ను క‌లిసిన‌వారు క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని సూచించారు. ‌ క‌రోనా బారిన‌ప‌డిన గ‌వ‌ర్న‌ర్ గ‌ణేషీ లాల్ జీ వేగంగా కోలుకోవాల‌ని ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఆకాంక్షించారు. ఆయ‌న‌కు సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా తిరిగి రావాల‌ని ప్రార్థిస్తున్నాని తెలిపారు. ఈమేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

కాగా ఒడిశాలో ప్రస్థుతం 12,930 యాక్టివ్ కరోనా కేసులున్నాయని, 1331 మంది కరోనాతో మరణించారని ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/