ఎన్టీఆర్ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోతారు: ఏపీ గవర్నర్

అమరావతి : నేడు దివంగత నేత ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అందించిన సేవలను ఆయన ట్విటర్ వేదికగా కొనియాడారు. తెలుగు ప్రజలు గర్వపడే విధంగా సేవలందించారని, ఎన్టీఆర్ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోతారని అన్నారు. ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ పేరిట ఆలయంలో పూజలు నిర్వహించి మాట్లాడారు. నిమ్మకూరులో 30 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా రూపు దిద్దుతామని ప్రకటించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/