ప్రభాకర్‌రెడ్డిపై దాడి..నిందితుడు గంటాని రాజు ఫేస్‌బుక్ బయోను షేర్ చేసిన కెటిఆర్

రాహుల్‌గాంధీ! ఇదిగో ఆధారాలు.. ఇంకేమైనా కావాలా?..కెటిఆర్‌

It was KTR who shared the Facebook bio of accused Gantani Raju

హైదరాబాద్‌ః దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిన గటాని రాజు ముమ్మాటికీ కాంగ్రెస్ కార్యకర్తేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో నిందితుడు గంటాని రాజు ఫేస్‌బుక్ ఖాతా బయోతోపాటు మరో ఫొటోను షేర్ చేశారు. అందులో ‘జై కాంగ్రెస్ మిరుదొడ్డి మండల్’ అని రాసి రాజు రాసుకున్నాడు. రాజు మెడలో కాంగ్రెస్ కండువా కూడా ఉంది. అందులో అతడికి 2,400 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఫొటోను షేర్ చేసిన కెటిఆర్.. ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ గూండాయేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇంతకుమించి ఆధారాలు కావాలా? అని ప్రశ్నించారు.

రాజు దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీ ప్రభాకర్ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిలో ఆయన చిన్నపేగులోని కొంతభాగం దెబ్బతినడంతో ఆపరేషన్ వైద్యులు దానిని తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.