ఒకే ఒక జీవితం ట్రైలర్ రిలీజ్

శర్వానంద్ – రీతువర్మ జంటగా శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ఒకే ఒక జీవితం. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ బైలింగ్విల్ ఈ నెల 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఆసక్తి నింపారు. ‘ఒకే ఒక జీవితం’ అనేది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాధారణంగా ఇలాంటి సినిమాలు విలక్షణమైన కథాంశాలను కలిగి ఉంటాయి. అయితే ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ కూడా వుండటం ప్రత్యేకత. తల్లీ కొడుకుల మధ్య బాండింగ్ ను ఇందులో ప్రధానంగా చూపించబోతున్నారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే..మ్యూజిక్ కాంపిటీషన్ లో తదుపరి రౌండ్ కు చేరుకున్న యువ సంగీతకారుడిగా శర్వానంద్ ను పరిచయం చేస్తోంది. కానీ అతనికి సపోర్ట్ గా ఉత్సాహాన్ని అందించే వ్యక్తి అతనితో లేరని దానిపై ఫోకస్ చేయలేకపోతున్నాడు. అతనికి తోడుగా ప్రేయసి (రీతూ వర్మ) ఉన్నప్పటికీ.. ఒంటరిగా ఉన్నాననే భావనలో అసమర్థంగా భావిస్తాడు.

ఇలాంటి పరిస్థితులలో అతను కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన తన తల్లిని కలుసుకునే అవకాశాన్ని పొందుతాడు. ఒక సైంటిస్ట్ (నాజర్) కనుగొన్న టైమ్ మెషీన్ సహాయంతో.. విధిని మార్చడానికి అతనికి రెండవ అవకాశం లభిస్తుంది. అతని గతం చాలా ఉద్వేగభరితమైనదని.. విషాదకరమైనదని తెలుస్తోంది. మరి అది ఎలా ఉంటుందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. శర్వానంద్ తల్లిగా అమల అక్కినేని నటించగా, వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్ లలో నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు – ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో డైలాగ్స్ రాయగా.. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు.

YouTube video